GO 16: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు.. హైకోర్టు సంచలన నిర్ణయం

by Prasad Jukanti |
GO 16: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు.. హైకోర్టు సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధం అని తెలంగాణ హైకోర్టు (High Court) స్పష్టం చేసింది. ఈ మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 (GO 16)ను కొట్టి వేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చెల్లదని తేల్చి చెప్పింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను (Contract Employees) క్రమబద్దీకరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం జీవో 16 తీసుకువచ్చింది. ఈ జీవో ద్వారా దాదాపు 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ప్రభుత్వం తెచ్చిన జీవో 16 తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి తమకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వ్యతిరేకించింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఆరోపిస్తూ ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా తీర్పు వెల్లడించిన హైకోర్టు జీవో 16 రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టం చేసింది.

ఆందోళనలో ఉద్యోగులు:

హైకోర్టు తాజా నిర్ణయంతో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. క్రమబద్ధీకరణ అయి ఆనందంగా ఉన్న తమ నియామకాలు చెల్లవని హైకోర్టు చెప్పడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎదైనా నిర్ణయం తీసుకుటుందా అనేది సస్పెన్స్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed