Vishwak Sen: ‘మెకానిక్ రాకీ’ సినిమా సెన్సార్ పూర్తి.. విశ్వక్ సేన్ పోస్ట్ వైరల్

by Hamsa |
Vishwak Sen: ‘మెకానిక్ రాకీ’ సినిమా సెన్సార్ పూర్తి.. విశ్వక్ సేన్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ‘మెకానిక్ రాకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని రవితేజ ముళ్ళపూడి(Ravi Teja Mullapudi) దర్శకత్వం వహించగా.. రామ్ తాళ్లూరి నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky) సెన్సార్ పూర్తి చేసుకుంది.

ఈ విషయాన్ని తెలుపుతూ విశ్వక్ సేన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. ‘మెకానిక్ రాకీ’ సినిమాకు యూ/ఏ(U/A) సర్టిఫికేట్ వచ్చినట్లు ఓ పోస్టర్‌ను పెట్టాడు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇందులోని బీజీఎం, యాక్షన్ సీన్లు సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Advertisement

Next Story

Most Viewed