FIR Filed: నర్సాపూర్ పోలీసుల నిర్వాకం.. చనిపోయిన వ్యక్తిపై FIR నమోదు

by Shiva |   ( Updated:2024-11-19 09:27:35.0  )
FIR Filed: నర్సాపూర్ పోలీసుల నిర్వాకం.. చనిపోయిన వ్యక్తిపై FIR నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసిన ఘటన మెదక్ జిల్లా (Medak District) నర్సాపూర్‌ (Narsapur)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం ఓ భూ వివాదంలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అందులో విఠల్ (Vittal) అనే వ్యక్తి గత ఆరేళ్ల క్రితమే మృతి చెందాడు. ఈ క్రమంలోనే విచారణ పోలీసుల విఠల్ ఇంటికి వెళ్లగా.. కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. కనీస విచారణ చేయకుండా చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం ఏంటని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నర్సాపూర్ పోలీసులు చేసిన నిర్వాకం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

Next Story