- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయనతార డాక్యుమెంటరీ పై స్పందించిన దేవర బ్యూటీ.. స్ట్రాంగ్ ఉమెన్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘నయనతార ది ఫెయిరీ టేల్’. ఇక నవంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ప్రస్తుతం మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. అయితే దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా స్పందించింది.
తాజాగా జాన్వీ తన ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో డాక్యుమెంటరీలోని నయనతార, విఘ్నేష్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘బలమైన మహిళను మరింత శక్తివంతంగా చూడటం కంటే స్పూర్పినిచ్చేది ఇంకేది లేదు’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. అలాగే దీనికి హార్ట్ సింబల్‌ను కూడా జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ఓ మూవీలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.