Mercury: బుధుడు సంచారం .. ఆ రాశుల వారికీ కష్టాలు

by Prasanna |
Mercury: బుధుడు సంచారం .. ఆ రాశుల వారికీ కష్టాలు
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. గ్రహాలన్నింటిలో బుధ గ్రాహం ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఈ గ్రహం అన్ని గ్రహాల కంటే ఎక్కువ సార్లు రాశి సంచారం చేస్తూ ఉంటుంది. త్వరలో బుధుడు, వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే, దీని ప్రభావం రెండు రాశుల వారికీ ప్రతికూలంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేష రాశి

బుధుడు సంచారం మేషరాశి వారిపై ప్రభావం చూపనుంది. వ్యాపారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పని చేసే ఆఫీసులో తొందర పడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల అనేక ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

మీన రాశి

బుధుడు సంచారం మీన రాశి వారికీ అశుభంగా ఉండనుంది. వ్యాపారాలు మొదలు పెట్టిన నష్టాలు వస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు రెండు నుంచి మూడు సార్లు ఆలోచించడం మంచిది. పెట్టుబడులు పెట్టె వారు జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. పడని ఆహారాలు తినకపోవడమే మంచిది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed