UG Exams: రాష్ట్రంలో యూజీ పరీక్షలు యథాతథం.. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో సర్కార్ చర్చలు సఫలం

by Shiva |
UG Exams: రాష్ట్రంలో యూజీ పరీక్షలు యథాతథం.. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో సర్కార్ చర్చలు సఫలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫీజు రీయింబర్స్‌మెంట్ (Reimbursement of Fees) బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ (Degree), పీజీ (PG) కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలువునిచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం‌ (Burra Venkatesham)తో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలు తెరుచుకోనున్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జరగాల్సిన అన్ని యూజీ పరీక్షాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ (Reimbursement of Fees) నిధులు విడుదల కాకపోవడంతో తాము ఆర్థికంగా చితికిపోతున్నామని డిగ్రీ (Degree), పీజీ (PG) కళాశాల యాజమాన్య సంఘాలు వెల్లడించాయి. దసరా హాలీడేస్ అనంతరం అక్టోబర్ చివరికల్లా డబ్బులు అకౌంట్లలో జమ చేస్తామని సర్కార్ హామీ ఇచ్చిందని అన్నారు. గతంలో అక్టోబర్ 14 నుంచి 17 వరకు కాలేజీలు మూసివేయగా విద్యా‌శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం (Burra Venkatesham) నిధుల విడుదల విషయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేడు కళాశాలల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చామని ప్రైవేటు కళాశాలల యాజమన్య సంఘాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story