విద్యార్థులకు గుడ్ న్యూస్.. బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నో ఎంట్రన్స్ టెస్ట్

by Jakkula Mamatha |
విద్యార్థులకు గుడ్ న్యూస్.. బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నో ఎంట్రన్స్ టెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) ఇంటర్ విద్యార్థుల(Inter Students)కు మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల సొసైటీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులా(Mahatma Jyotibapule BC Gurukula)ల్లో ఇంటర్(Inter), డిగ్రీ(Degree) సీట్లను ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండానే భర్తీ చేయాలని సొసైటీ నిర్ణయించింది. అయితే ప్రతి ఏడాది మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో ప్రవేశ పరీక్ష(Entrance Exam) నిర్వహిస్తున్నారు. కానీ ఇక నుంచి ఆ విధానాన్ని రద్దు చేసింది.

ఈ నేపథ్యంలో ఈ అకడమిక్ సంవత్సరం నుంచి ప్రవేశ పరీక్ష లేకుండా అడ్మిషన్లు స్వీకరించనున్నారు. ఇందులో అడ్మిషన్ల కోసం పదో తరగతిలో వచ్చిన మార్కులు, మెరిట్ ఆధారంగా ఇంటర్‌లో ప్రవేశం కల్పిస్తారు, ఇంటర్ మార్కులు, మెరిట్ ఆధారంగా డిగ్రీలో అడ్మిషన్లు కల్పిస్తారు. త్వరలో డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీ గురుకులాల సొసైటీ పరిధిలోని 261 ఇంటర్, 33 డిగ్రీ కాలేజీల్లో కలిపి మొత్తం 25 వేల సీట్లు ఉన్నాయి.



Next Story