- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
All Party Meeting: పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు.. ఈ నెల 24న ఆల్ పార్టీ మీటింగ్
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliament Winter Session) నేపథ్యంలో ఈ నెల 24న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష (All Party Meeting) సమావేశం నిర్వహించబోతున్నది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) మంగళవారం ప్రకటించారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్న పార్లమెంట్ వింటర్ సెషన్స్ లో 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' (One Nation One Election), వక్ఫ్ (సవరణ) బిల్లు-2024 వంటి కీలక బిల్లులు పార్లమెంట్ కు రాబోతున్నాయనే చర్చ జరుగుతున్నది. వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలపై సభలో అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగవచ్చని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్వహించబోతున్న అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు ఎలాంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచనున్నది అనేది ఆసక్తిగా మారింది. అలాగే రాజ్యాంగం ఆమోదం పొందిన 75వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది.