Chandrababu : వైసీపీ హయాంలో చంద్రబాబుపై మహా కుట్ర : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
Chandrababu : వైసీపీ హయాంలో చంద్రబాబుపై మహా కుట్ర : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం చంద్రబాబు(Chandrababu) పై మహా కుట్ర జరిగిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy)కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో పొరపాటు జరిగినట్లు తాను ఎప్పుడూ చెప్పలేదని ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి పీ.వి.రమేశ్ స్పష్టం చేశారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును జైలులో పెట్టేందుకు అప్పటి సీఎం జగన్ హస్తముందని ఆయన చెప్పారన్నారు. సీఐడీ, సీఎంవో, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసులలో ఏకకాలంలో ఫైళ్ళు మాయమవ్వడానికి సీఎం జగన్ హస్తం ఉంటేనే సాధ్యమని సదరు ఐఏఎస్ అధికారి అభిప్రాయ పడ్డారన్నారు.

ఫైళ్లు మయమవ్వడంపైన, తన వాంగ్మూలంపైన విచారణ జరిపించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి డీజీపీకి లేఖ రాశారని గుర్తు చేశారు. అ లేఖపై విచారణ ఏం చేశారో తేల్చాలని, దీనిపై ప్రస్తుత ప్రభుత్వం స్పందించాలన్నారు. చంద్రబాబు నాయుడిని 53రోజులు అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలులో పెట్టారని, అందుకే దీనిపై జీరో అవర్ పక్కన పెట్టి ప్రభుత్వం ప్రకటన చేయాలని కోటంరెడ్డి కోరారు. ఇది చాలా ముఖ్యమైన అంశం దీనిపై అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అయితే డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్.రాజు స్పందిస్తూ ఇది చాల సీరియస్ అంశమని, జీరో అవర్ లో దీనిపై సమాధానం కుదరనందునా ప్రత్యేకంగా చర్చిద్దామని సూచించారు.

Next Story

Most Viewed