- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెల 25 వరకు కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు ఈవెంట్స్..
దిశ, శేరిలింగంపల్లి: ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు న్యాయస్థానం ఉత్తర్వులతో 7 మార్కులు కలపడంతో పాటు 1 సెంటీమీటర్ ఎత్తులో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించిన విషయం విధితమే. దులో భాగంగానే కొండాపూర్ లోని 8వ బెటాలియన్ లో అధికారులు బుధవారం నుంచి 10 రోజుల పాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 8,300 మంది పురుషులు, 3,185 మంది మహిళా అభ్యర్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సుమారు 600 మంది అభ్యర్థులకు ఈవెంట్స్ కు హాజరు కానున్నారు. మైదానంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
తొలిరోజు 600 మంది అభ్యర్థులకు శారీరక దేహాదారుఢ్య పరీక్షలు ఉండగా 383 మంది హాజరయ్యారు. అందులో 71 మంది అర్హత సాధించారని అధికారులు తెలిపారు. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా 16, 17, 19 వ తేదీల్లో శారీరక దేహాదారుఢ్య పరీక్షలను నిర్వహించనున్నారు. ఎలాంటి అవకతవకలకు విమర్శలకు తావు లేకుండా శారీరక పరీక్షలు జరిగే మైదానంలో సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతున్నామని, అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు డిజిటల్ మీటర్లు ఉపయోగిస్తున్నారని, పురుష అభ్యర్థులకు 1600 మీటర్లు పరుగుకు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగుకు ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్) కార్డులను ఉపయోగించి అత్యాధునిక పరికరాలతో ఆటోమేటిక్ గా సమయాలన్ని రికార్డు నమోదు అయ్యేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఎంపిక ప్రక్రియను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు.