- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దిశ,సికింద్రాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నాడని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్ వారసిగూడలో ప్రజా గోష..బీజేపీ భరోసా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు పేదలకు రెండు పడక గదులు వచ్చే అవకాశమే లేదన్నారు. డబ్బులతో రాజకీయం చేయడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ లో సరైన రహదారులు, నీళ్లు, నియామకాలు, రెండు పడక గదుల ఇళ్లు,పెన్షన్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని, కల్వకుంట్ల అవినీతి పాలన సాగుతుందని ధ్వజమెత్తారు.
స్థానిక ప్రజల సమస్యలు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకొని వారి ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పోరాటాలు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజానికానికి వెన్నుదన్నుగా నిలుస్తుందని అన్నారు. బీజేపీ చేపట్టిన ప్రజా గోస- బీజేపీ భరోసా కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన బాగా ఉందని అన్నారు. టీఆర్ఎస్ అక్రమ పరిపాలన, అవినీతి కుంభకోణాలను ప్రజలకు చెబుతూ వారిని జాగృతం చేసే కార్యక్రమమే భరోసా కార్యక్రమమని వెల్లడించారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ గత 9 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, వారి అవినీతి కుంభకోణాలను ప్రజలకు తెలిపేందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, బస్తీలలో ఈ కార్యక్రమం ఈ నెల 25 వరకు కొనసాగుతుందన్నారు.