- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాయదుర్గం లిడ్ క్యాప్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
by Nagam Mallesh |
X
దిశ, శేరిలింగంపల్లిః ఇప్పుడు ఎక్కడ చూసినా కూల్చివేతల సీజన్ నడుస్తుంది. హైడ్రా ఓవైపు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలోని నిర్మాణాలు కూలుస్తుండగా.. మరోపక్క రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించే పనిలో పడ్డారు. తాజాగా లిడ్ క్యాప్ సంస్థ కూడా తన భూములను కాపాడుకునే పనిలో పడింది. సోమవారం శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. లిడ్ క్యాప్ కు చెందిన రాయదుర్గం సర్వేనెంబర్ 2, 3, 4, 5లో ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే అక్కడి స్థలాల్లో ఉన్న వారు మాత్రం గత 40 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story