పాతబస్తీలో మొసలి కలకలం

by Julakanti Pallavi |
పాతబస్తీలో మొసలి కలకలం
X

దిశ, చార్మినార్: పాతబస్తీ మీరాలం చెరువు ఒడ్డున మొసలి కనిపించింది. ఈవినింగ్ వాక్ కు వచ్చిన వారు చెరువు ఒడ్డున సుమారు 10 అడుగుల పొడవు ఉన్న మొసలిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించి.. వారు చేరుకునేలోపే మొసలి తిరిగి చెరువులోకి వెళ్ళిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇంకా చెరువులో 20 వరకు మొసళ్ళు ఉండవచ్చని, వెంటనే వాటిని పట్టుకుని జూ కు తరలించాలని చేపలు పట్టేవారు కోరుతున్నారు.

Advertisement

Next Story