- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లు.. కార్పొరేటర్‌కి ఎంపీ సూచన
దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్‌కి నిధులు మంజూరు చేసి, అభివృద్ధికి సహకరించాలని కోరుతూ స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గచ్చిబౌలి డివిజన్ నాయకులతో కలిసి గురువారం ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసిన కార్పొరేటర్ డివిజన్‌లోని గోపన్‌పల్లి తాండ, ఎన్టీఆర్ నగర్‌లలో నూతన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. అలాగే, గోపన్‌పల్లిలోని మెట్లకుంట చెరువు, నానక్ రాంగూడలోని భగీరమ్మ చెరువులను ఆధునీకరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి తమవంతు కృషిచేయాలని వినతి పత్రంలో కోరారు.
డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని గంగాధర్ రెడ్డి ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని ఎంపీ రంజిత్ రెడ్డి అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, డివిజన్ అభివృద్ధికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, తిరుపతి, బి.విఠల్, అలకుంట శ్రీరాం, నాగ సుబ్రహ్మణ్యం, దేవేందర్ రెడ్డి, హరీష్ శంకర్ యాదవ్, కిషన్ గౌలి, అరుణ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మన్నే రమేష్, రంగస్వామి, గోపాల్, జితేందర్ సింగ్, రాజు, శ్రీను, యాదగిరి, నరేందర్, నరేష్,తదితరులు పాల్గొన్నారు.