నాంపల్లి పోలీస్ స్టేషన్లో నిరసన తెలియజేసిన బీఎస్పీ నాయకులు..

by Sumithra |
నాంపల్లి పోలీస్ స్టేషన్లో నిరసన తెలియజేసిన బీఎస్పీ నాయకులు..
X

దిశ, కార్వాన్ : నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట బీఎస్పీ కార్యకర్తలు సోమవారం ధర్నా నిర్వహించడంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరసన కారులను అరెస్ట్ చేసి బేగం బజార్, నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా నాంపల్లి పోలీస్ స్టేషన్లో బీఎస్పీ నాయకులు నిరసన తెలియజేశారు. అనంతరం పలువురు బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీలో ఇంటి దొంగలను తక్షణమే అరెస్టు చేయాలని, కమీషన్ పూర్తి ప్రక్షాళన తరువాతనే గ్రూప్-1, ఇతర పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

పోలీసుల తీరుపై బీఎస్పీ నేతలు మండిపడ్డారు. తాము శాంతి యుతంగా నిరసనలు తెలియచేస్తే వారిని అడ్డుకొని వారి పై పోలిసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనీ, ఓ వైపు ఈడి, సిట్ విచారణ జరుగుతున్న నేపద్యంలో గ్రూప్ 1 పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిచారు. టీఎస్పీఎస్సీ వెంటనే రద్దుచేసి కొత్త బోర్డు నియమించిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలనీ డిమాండ్ చేశారు. రమేష్ (హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్), బాలరాజు, నరేందర్ (సికింద్రాబాద్ జిల్లా ఇంచార్జ్) సుజాత కోనేటి (జూబ్లీహిల్స్ జిల్లా ఇన్చార్జ్) అరుణ, సునీల్, రుద్రవరం, చాట్ల చిరంజీవి, లింగం, రవీందర్ నాయక్ అనితారెడ్డి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed