- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > BREAKING: చింతలకుంటలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. హైదారాబాద్ -విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం
BREAKING: చింతలకుంటలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. హైదారాబాద్ -విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని చింతలకుంట చెక్‌పోస్ట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి అతివేగంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో విద్యుత్ స్తంభం రోడ్డుపై పడిపోవడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించింది. ఆంధ్రాకు వెళ్లే ఏకైక అతిపెద్ద జాతీయ రహదారి కావడంతో ముఖ్యంగా చింతల కుంట వద్ద ఆంధ్రాకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి అక్కడే బస్ స్టాప్ ఉండటంతో పరిస్థితి కష్టతరంగా మారింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ స్తంభాన్ని పునరుద్ధరించే పనిలో పడ్డారు.
Next Story