ప్రధాని మోదీ తెలంగాణకు చేస్తున్నవి ఇవే..!

by srinivas |   ( Updated:2023-09-29 14:22:13.0  )
ప్రధాని మోదీ తెలంగాణకు చేస్తున్నవి ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు సర్వం సిద్దం చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఢిల్లీ వెళ్లే దాక భద్రత కట్టుదిట్ట చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా జాతీయ రహదారులను ప్రారంభిస్తారని తెలిపారు. రూ.6,404 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేయనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.


మహబూబ్‌నగర్‌లో హెచ్‌పీసీఎల్ పైపు లైన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారని కిషన్ రెడ్డి పేర్నొన్నారు. రూ.2,661 కోట్లతో హసన్-చర్లపల్లి మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ పైప్ లైన్ ఏర్పాటుతో 37 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. జక్లేర్-కృష్ణ మధ్య కొత్త రైల్వే లైనును మోదీ జాతీకి అంకితం చేస్తారన్నారు. దీని వల్ల హైదరాబాద్-గోవా మధ్య 120 కి.మీ మేర దూరం తగ్గుతుందని చెప్పారు. కాచిగూడ-రాయచూర్ రైలు సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. కృష్ణపట్నం నుంచి తెలంగాణకు మల్టీ ప్రొడక్ట్ పైపు లైన్ నిర్మాణం జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. తొలి విడతగా రూ.1930 కోట్ల కేటాయింపులు జరిగాయన్నారు. ఈ పైప్ లైన్ ద్వారా డీజిల్, పెట్రోల్, కిరోసిన్, జెట్ ఇంధనం సరఫరా చేయొచ్చన్నారు. HCUలో ఆరు కొత్త భవనాలను సైతం ప్రధాని మోదీ ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రూ.12 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. కొత్త జిల్లాల్లోనూ జాతీయ రహదారుల అనుసంధానం నడుస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story