మందు బాబులకు దెబ్బ మీద దెబ్బ.. మరో 12 గంటల పాటు వైన్ షాపులు బంద్..!

by Satheesh |   ( Updated:2024-05-12 13:07:32.0  )
మందు బాబులకు దెబ్బ మీద దెబ్బ.. మరో 12 గంటల పాటు వైన్ షాపులు బంద్..!
X

దిశ, క్రైమ్ బ్యూరో: వైన్ షాపులు బంద్ అయ్యి తీవ్ర ఇబ్బందులు పడుతోన్న మందు బాబులకు పోలీసులు మరో బ్యాడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ పరిధిలో మద్యం అమ్మకాలపై మరో 12 గంటల పాటు నిషేధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదివారం మరో ఉత్తర్వును జారీ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 11 సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు (48 గంటలు) మద్యం అమ్మకాలపై మొదట నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని మరో 12 గంటలు పొడగిస్తూ సిటీ కమిషనర్ తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం కొనసాగనుంది. ఈ వార్త విన్న మందు బాబులు మరోసారి తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు.

Advertisement

Next Story