Hyd: చంద్రబాబుతో భేటీ... మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-07-31 15:13:21.0  )
Hyd: చంద్రబాబుతో భేటీ... మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబును సినీనటుడు మంచు మనోజ్ దంపతులు హైదరాబాద్‌లో కలిశారు. సతీమణి భూమా మౌనికతో కలిసి మంచు మనోజ్ చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిసి ముచ్చటించారు. అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ మంగళవారం తమ బాబు పుట్టిన రోజు ఉందని.. ఆశీస్సుల కోసం చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. తమ పెళ్లి తర్వాత చంద్రబాబును కలవడం కుదరలేదని.. అందుకుని తాజాగా కలిశామని చెప్పారు. ప్రస్తుతానికి చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశామని, రాజకీయ ప్రవేశంపై సందర్భం వచ్చినప్పుడు మౌనికనే చెబుతారని మంచు మనోజ్ స్పష్టం చేశారు.

కాగా రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబును మంచు మనోజ్ ఫ్యామిలీ కలిసిందని ప్రచారం జరిగింది. అయితే తాము మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పడంతో ఆ ప్రచారానికి మంచు మనోజ్ చెక్ పెట్టినట్లైంది.

ఇవి కూడా చదవండి టీడీపీలోకి మంచు మనోజ్?: వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ

Advertisement

Next Story