- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్ లైన్ జాతకాల పేరుతో భారీ మోసం..
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఆన్ లైన్ జాతకాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ జ్యోతిష్యుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకారం.. పంజాబ్ కు చెందిన లలిత్ లవ్ ఆస్ట్రాలజీ సాకుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిపారు. గత అక్టోబర్ 19వ తేదీన హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్ లో జ్యోతిష్యుడి కోసం వెతుకుతుండగా లలిత్ అనే జ్యోతిష్యుడు పరిచయం అయ్యాడు. అతను తన తండ్రి గోపాల్ శాస్త్రి పేరుతో ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఆస్ట్రా క్రియేట్ చేశాడు. అందులో ఉన్న ఫోన్ నెంబర్ 9592339095 కు కాల్ చేసి అతనితో ఫోన్‌లో సంప్రదించింది. ఆమెకు ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలంటే పూజలు చేయాలనే నెపంతో అతను మొదట రూ. 32 వేలు వసూలు చేశాడు. తర్వాత అతను మరికొన్ని కారణాలను చెప్పి మొత్తం రూ. 47,11,808 రాబట్టాడు. ఇలా పలుమార్లు డబ్బులు అడుగుతుండడంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళ తాను చెల్లించిన మొత్తం డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది.
అతడు డబ్బు చెల్లించడానికి నిరాకరించడమే కాకుండా ఆమె ఫోన్ కాల్స్ కు స్పందించడం కూడా నిలిపివేశాడు. దీంతో మహిళ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు నిందితుడు లలిత్ (38) పంజాబ్ లోని మొహాలీలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసి నగరానికి తీసుకువచ్చారు. అతని నుంచి రెండు సెల్ ఫోన్లు, రెండు డెబిట్ కార్డులు, బ్యాంక్ చెక్ బుక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఏసీపీ (సీసీఎస్) కెవీఎం ప్రసాద్, ప్రత్యక్ష పర్యవేక్షించారు. ఇన్‌స్పెక్టర్ కె హరిభూషణరావు, ఎస్ఐలు సురేష్, శైలేందర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.