- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy:హైదరాబాద్ అంటే గంగా-జమునా తెహజీబ్.. సీఎం రేవంత్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుతుబ్ షాహీ టూంబ్స్ ను సందర్శించిన రేవంత్ రెడ్డి అక్కడ ఓ మొక్కను నాటారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ హాజరయ్యారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వేల ఏళ్ల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలికారు. అలాగే శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలతో పాటు ఇతరులు ఈ ప్రాంతాన్ని పాలించారని, వారిలో ప్రతి ఒక్కరు తమదైన సాంస్కృతిక ముద్రను వేశారని తెలిపారు.
చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహి సమాధులు, పైగా సమాధులు, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటివి వాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయంగా ఉందన్నారు. శతాబ్దాలుగా హైదరాబాద్ 'గంగా-జమునా తెహజీబ్' గా పిలువబడుతూ.. బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని, సహజీవనాన్ని చూసిందని తెలిపారు. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ , సెవెన్ టూంబ్స్ ఔట్స్ షాహిన్ రాజవంశం నిర్మాణ నైపుణ్యానికి, సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. మన ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటంతో పాటు ప్రపంచ పటంలో సగర్వంగా ఉంచుతుందని చెప్పారు. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప దేవాలయం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. ఇక 2013లో ఎమ్ఓయూతో ప్రారంభించి, 100 కంటే ఎక్కువ స్మారక చిహ్నాల పరిరక్షణతో పాటు 106 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ కార్యక్రమం అతిపెద్ద పరిరక్షణ ప్రయత్నానికి నిదర్శనమన్నారు. ఆఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సహకారానికి, ఉదారతకు తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ ప్రజల తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.