- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HYD: రేపు హనుమాన్ జయంతి.. నగరంలో పలుచోట్ల టాఫిక్ ఆంక్షలు
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసులకు మరో సవాల్ ఎదురు కాబోతోంది. రేపు హనుమాన్ జయంతి కావడంతో హైదారాబాద్ సిటీలో పలు హిందూ సంఘాలు శోభాయాత్రను చేపట్టబోతున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ ముమ్మరంగా భద్రతా చర్యలను చేపడుతోంది. ఈ మేరకు నగరంలోని పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి వెల్లడించాచు. ఉదయం 11.30కి శోభాయాత్ర గౌలిగూడ రామ మందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభమై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్‌కు చేరుకుంటుంది.
ఈ మధ్యలో శోభాయాత్ర పుత్లీబౌలీ క్రాస్ రోడ్స్, ఆంధ్రబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, డీఎం అండ్ హెచ్ఎస్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామకోటి క్రాస్ రోడ్స్, కాచీగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, వైశ్రాయ్ హోటల్ వెనక వైపు, ప్రాగా టూల్స్, కవాడీగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్ పేట్ రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయినీ మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంగోపాలపేట్ పీఎస్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపెరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్, తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు 11 కి.మీ మేర శోభాయాత్ర కొనసాగనుంది.
అదేవిధంగా మరో శోభాయాత్ర రాచకొండ కమిషనరేట్ పరిధిలో కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమై చంపాపేట దగ్గర హైదరాబాద్‌లోకి ఎంటర్ అవుతోంది. అక్కడి నుంచి చంపాపేట క్రాస్ రోడ్, ఐఎస్ సదన్, ధోబీఘాట్, సైదాబాద్ వై జంక్షన్, సైదాబాద్ కాలనీ రోడ్, శంకేశ్వర్ బజార్ నుంచి రాచకొండలోకి ఎంటర్ అవుతోంది. అనంతరం సరూర్ నగర్‌లోకి ఎంటరై రాజీవ్ గాంధీ విగ్రహం, దిల్‌సుఖ్‌నగర్ మీదుగా.. మూసారంబాగ్ జంక్షన్, మలక్ పేట్, నల్గొండ క్రాస్‌రోడ్, అంజంపురా రోటరీ, చాదర్ ఘాట్ క్రాస్ రోడ్డు నుంచి ఉమెన్స్ కాలేజ్ జంక్షన్ దగ్గర శోభాయాత్రతో కలుస్తుంది.