HYD : 12 నిమిషాల్లోనే సైబర్ కంప్లైంట్.. రూ. కోటి నగదు ఫ్రీజ్

by Rajesh |
HYD : 12 నిమిషాల్లోనే సైబర్ కంప్లైంట్.. రూ. కోటి నగదు ఫ్రీజ్
X

దిశ, క్రైమ్ బ్యూరో : సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి కోటి రూపాయలు నగదు వెళ్లకుండా 12 నిమిషాల్లో బాధితుడు స్పందించి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 కు ఫొన్ చేయడంతో అవి నిలిచి పోయాయి. బాధితుడి సమయ స్ఫూర్తిని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖ గోయల్ సోమవారం అభినందించారు. ఓ ప్రకటనలో ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ నాచారం కు చెందిన హర్ష కరెంటు అకౌంట్ నుంచి ఈ నెల 27 వ తేదిన 3 లావాదేవిల్లో మొత్తం రూ.కోటిపైన నగదు గుర్తు తెలియని ఖాతాల్లోకి వెళ్లాయి. ఈ మెసేజ్‌లు అందిన వెంటనే హర్ష యాక్సిస్ బ్యాంకుకు ఫిర్యాదు చేసి ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోర్టల్ 1930కు ఫోన్ చేసి ఖాతాల్లోకి వెళ్లిన వివరాలను నమోదు చేశారు.

ఫిర్యాదు అందగానే 1930 సైబర్ క్రైమ్ సిబ్బంది అప్రమతమై ఆ నగదును బదిలీకాకుండా ఆపేశారు. దీంతో అనుమానిత ఖాతాల్లోకి ఆ డబ్బు బదిలీ కాకుండా నిలిచి పోయాయని శిఖ గోయల్ వివరించారు. ఇలా బాధితుడు గోల్డెన్ అవర్‌లో స్పందించిన తీరు 1930 సిబ్బంది చాక చక్యంగా పని చేసిన విధానాన్ని ఆమె ప్రశంసించారు. ఇదే విధంగా ప్రతి ఒకరు సైబర్ మోసాల్లో మోసానికి గురైనప్పుడు అప్రమతమై బ్యాంకు, 1930 కు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. గోల్డెన్ అవర్‌లో స్పందిస్తే కచ్చితంగా మీ నగదు సైబర్ క్రిమినల్స్ చేతిలోకి వెళ్లకుండా బ్రేక్ వెయ్యొచ్చని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖ గోయల్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed