- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుస్నాబాద్ టికెట్ ఎవరికి? హస్తం క్యాడర్‌లో కన్ఫ్యూజన్!
దిశ, సైదాపూర్ : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హుస్నాబాద్ అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం జరుగుతుండడంతో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే టెన్షన్ కార్యకర్తల్లో మొదలైంది. గతంలో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ కాంగ్రెస్ నుంచి బరిలో దిగేందుకు సన్నద్ధం కాగా, కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. అందులో భాగంగా పోన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి తన ఓటు హక్కును హుస్నాబాద్‌కు మార్చుకున్నాడు. పొన్నం హుస్నాబాద్‌లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అద్దె ఇల్లు తీసుకుని కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు మార్చాడు. అయితే హుస్నాబాద్‌లో పోటీ చేయడానికి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్న 162గ్రామాల్లో సగం గ్రామాలకు పైగా ‘పల్లె పల్లెకు ప్రవీణ్ అన్న గడప గడపకు కాంగ్రెస్ పార్టీ’ అనే నినాదంతో 90గ్రామాలకు పైగా ఇప్పటి వరకే ప్రచారం నిర్వహించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి...
గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులను ఖరారు చేసినా.. ఇతర పార్టీ నాయకులు ప్రచారం మొదలుపెట్టినా అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కమ్యూనిస్టుల పొత్తుల భాగంగా కాంగ్రెస్ వర్సెస్ సీపీఐ అంటూ సాగదీసి.. సాగదీసి చివరకు పోత్తులో భాగంగా చివరి క్షణంలో సీపీఐ అభ్యర్థికి టికెట్ కేటాయించారు. కానీ ఈ సారి పొత్తుల ప్రభావం లేదు. కానీ, మాజీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎంపీ మధ్య హోరాహోరీగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం వద్ద మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ బలాబలాలను చూపిస్తున్నారు. ఏది ఏమైనా అధిష్టానం తొందరగా నిర్ణయం తీసుకుని అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారు.
బీఆర్ఎస్ ప్రచారం మొదలు...
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. అంతేకాకుండా ఏకంగా ఈ నెల 15న ఆదివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ మొట్ట మొదటి భారీ బహిరంగ సభతోపాటు హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచార శంఖారావం పూరించేందుకు సిద్ధమయ్యారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో గందరగోళం మొదలైంది. అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించి సభలు, సమావేశాల తేదీలను ఖరారు చేసి ప్రచారం జోరందుకున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల ప్రకటన జాప్యంపై కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది. టిక్కెట్ల ఖరారులో ఆలస్యం చేస్తే కొంపమునిగే ప్రమాదం ఉందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గందరగోళంలో ఇరువర్గాల క్యాడర్...
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇరువర్గాల క్యాడర్ హుస్నాబాద్ టికెట్ ఎవరికీ కేటాయిస్తారని గందరగోళానికి గురవుతున్నారు. ఏది ఏమైనా ఇరువర్గాల క్యాడర్‌ను బుజ్జగించి టికెట్ తొందరగా కేటాయించాలని కార్యకర్తలు కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరిలో హుస్నాబాద్ టికెట్టు ఎవరికి కేటాయిస్తుందనేది వేచి చూడాల్సిందే.