- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతులకు భారీ గుడ్‌న్యూస్.. రూ.2 లక్షల సాయం ప్రకటించిన ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: దేశానికి వెన్నుముక రైతులే అని తరచూ రాజకీయ నాయకులు చెబుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి రైతులు నిత్యం ఏదో ఒక ఆపదతో, కరువుతో, అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. వర్షాభావ పరిస్థితులు, చీడపీడల వల్ల, పంటలు సరిగ్గా పండగ రైతులు అప్పుల ఊబిలో కూరుకుంటున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయంగా, పంట పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి రూ. 6 వేలు ఇస్తున్న సంగతి తెలసిందే. అయితే తాజాగా ప్రభుత్వం మరో కొత్త సూపర్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో రైతులు 2 లక్షల రూపాయలను పొందవచ్చు. రైతులకు పాడిపరిశ్రమ మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే ఇందుకోసం మేలైన జాతి పశువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
వాటికి పశువుల షెడ్‌ను నిర్మించుకోవాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. కాగా పాడిపరిశ్రమ నెలకొల్పాలనుకునే వారు బయట ఎక్కడో అప్పులు, లోన్స్ తెచ్చుకోవడం అవసరం లేదు. ప్రభుత్వ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీం ద్వారా రైతులకు పశువుల పాక నిర్మాణం కోసం రెండు లక్షల వరకు ఆర్థికసాయాన్ని అందిస్తున్నది. ఎంఎన్ఆర్ఈజీఏ పథకంలో భాగంగా పాడి రైతులు పశువుల షెడ్ నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ.2 లక్షల వరకు సాయం అందించి, దానిపై సబ్సిడీ కూడా ఇస్తుంది. పశుపోషణను, రైతులకు ఆదాయ మార్గాలను కల్పించేందుకు ప్రభుత్వం ఈ స్కీం ద్వారా ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకానికి అప్లికేషన్ చేసుకోవాలనుకునే రైతులు సమీప బ్యాంకుకు వెళ్లి ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫారమ్ ను నింపాల్సి ఉంటుంది.