BREAKING: ఎన్నికల వేళ ఉప్పల్, కీసరలో భారీగా నగదు పట్టివేత

by Satheesh |   ( Updated:2024-05-12 13:23:50.0  )
BREAKING: ఎన్నికల వేళ ఉప్పల్, కీసరలో భారీగా నగదు పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ హైదరాబాద్‌లోని ఉప్పల్, కీసరలో భారీ నగదు పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. వాహనాల్లో రూ.2 కోట్లు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నగదును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి వరంగల్ వైపు డబ్బు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కాగా, పట్టుబడిన రెండు కోట్ల నగదు ఎవరిదనే విషయం తెలియాల్సి ఉంది. ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకే ఈ డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story