- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూపీఏ కు మద్దతివ్వడానికి ఎంతిచ్చారు: అసదుద్దీన్ ఓవైసీ
దిశ, డైనమిక్ బ్యూరో: నరేంద్ర మోడీ, కేసీఆర్ నుంచి డబ్బులు తీసుకుని మాపై దేశమంతటా మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు. 2008 అణు ఒప్పందం సమయంలో యూపీఏకు మద్దతు ఇచ్చేందుకు ఎంత డబ్బు ఇచ్చారు? ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ కు మద్దతివ్వడానికి మాకు ఎంత డబ్బు ముట్టజెప్పారు? రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చేలా జగన్ మోహన్ రెడ్డిని ఒప్పించడానికి నాకు ఎంత ఇచ్చారో రాహుల్ చెప్పాలన్నారు.
2014 రాహుల్ గాంధీ ఓటమికి తాము బాధ్యులం కాదని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే అని ఎటాక్ చేస్తున్నారు. మోడీ, కేసీఆర్ వద్ద ఎంఐఎం డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ పోటీ చేసిన అక్కడ బీజేపీ కి అనుకూలించేలా మజ్లిస్ పోటీకి దిగుతుందని ఆరోపిస్తున్నారు.