- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hot News: అధ్యక్షుడు Vs బీజేఎల్పీ..! రెండు వర్గాలుగా చీలిన ఎమ్మెల్యేలు?
దిశ, తెలంగాణ బ్యూరో: టీ బీజేపీలో లీడర్ల మధ్య వర్గపోరు రోజురోజుకూ ఎక్కువవుతోంది. పార్టీని నడిపించేందుకు జోడెద్దుల్లాగా కలిసి వెళ్లాల్సిన వారే ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ వర్సెస్ బీజేఎల్పీ అన్నట్టుగా పరిస్థితి మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేఎల్పీ నేత ఇద్దరూ ఢీ అంటే ఢీ అని తలపడుతున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. రెండు వర్గాలుగా ఎమ్మెల్యేలు చీలిపోయారని చెప్పుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంట కొందరు ఉండగా, ఇంకొందరు ఎమ్మెల్యేలు బీజేఎల్పీ నేత ఏలేటి వెంట ఉన్నట్టు తెలుస్తోంది. సుంకిశాల పరిశీలనతో ఈ అంశం తేటతెల్లమైందని చెబుతున్నారు.
పార్టీ ఆదేశించినా గైర్హాజరు
నల్లగొండ జిల్లాలోని సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిపోవడంతో పరిశీలనకు ఎమ్మెల్యేలంతా కలిసి వెళ్లాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. Hot News: అధ్యక్షుడు Vs బీజేఎల్పీ..! రెండు వర్గాలుగా చీలిన ఎమ్మెల్యేలు?ఈ పర్యటనను పార్టీ కూడా అంగీకరించింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. అయితే తీరా పరిశీలనకు బీజేఎల్పీ నేత ఏలేటితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారు. అందులో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పటేల్ ఉన్నారు. వారి వెంట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి సైతం ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వెళ్లని వారి జాబితాలో రాజాసింగ్, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త, పైడి రాకేశ్‌రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ ఉన్నారు. పార్టీ ఆదేశించినా ఎల్పీ నేత వెంట ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లడంతో పార్టీలో ఈ అంశంపై చర్చించుకుంటున్నారు.
కిషన్‌రెడ్డికి నచ్చలేదా..
సుంకిశాల పరిశీలనకు పార్టీ ఆదేశించినా ఐదుగురు ఎమ్మెల్యేలు వెళ్లకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కిషన్‌రెడ్డి వర్గీయులు కావడం వల్లే వెళ్లలేదనే చర్చ జరుగుతోంది. తమ సెగ్మెంట్‌లో పలు కార్యక్రమాల వల్ల వెళ్లలేకపోయినట్లుగా పలువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఏలేటికి ఎమ్మెల్యేల నుంచి అనుకున్నంత స్థాయిలో మద్దతు దక్కడంలేదనేది అర్థమవుతోందని చర్చించుకుంటున్నారు. కొద్దిరోజులుగా పార్టీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి, బీజేఎల్పీ నేత ఏలేటికి ఏ మాత్రం పొసగడం లేదని తెలుస్తోంది. స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు బీజేఎల్పీ పోస్టుకు సమానం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బీజేఎల్పీ నేతగా మహేశ్వర్‌రెడ్డికి అవకాశం రావడం కిషన్‌రెడ్డికి ఇష్టం లేదని సమాచారం. ఆయన హైకమాండ్‌కు మరొకరి పేరును పరిశీలనలోకి తీసుకెళ్లగా చివరకు ఏలేటికి అవకాశం దక్కడంతో ఇరువురి నడుమ ఆధిపత్య పోరు మొదలైనట్టు తెలుస్తోంది. మరి ఇరువురు నేతల మధ్య సంధి కుదురుతుందా? జోడెద్దుల్లా కష్టపడి పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తారా? లేక వైరంతో నష్టాన్ని చేకూరుస్తారా? అనేది చూడాలి.