హెచ్ఎమ్‌డీఏ సర్వర్ డౌన్.. వెబ్ సైట్‌లో మాయమైన చెరువుల వివరాలు..?

by Mahesh |   ( Updated:2024-09-11 12:07:19.0  )
హెచ్ఎమ్‌డీఏ సర్వర్ డౌన్.. వెబ్ సైట్‌లో మాయమైన చెరువుల వివరాలు..?
X

దిశ, వెబ్ డెస్క్: బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) సర్వర్ ఒక్కసారిగా డౌన్ అయింది. దీంతో మహానగర వ్యాప్తంగా ఆన్ లైన్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాగా సర్వర్ డౌన్ కావడం తో హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల డేటా కనిపించకుండా పోయింది. కాగా నగరంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చి వేస్తున్న సమయంలో హెచ్ఎమ్‌డీఏ సర్వర్ డౌన్ కావడం.. అందులో చెరువుల డేటా కనిపించకుండా పోవడంతో ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమస్యపై స్పందించిన అధికారులు సర్వర్ డౌన్ పై వర్క్ నడుస్తుందని వీలైనంత తొందరగా సర్వీస్‌లను పునరుద్దరిస్తామని తెలిపారు. అధికారులు స్పందించిన కొద్ది సేపటికే హెచ్ఎమ్‌డీఏ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed