- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Crackers shops : ఆర్మూర్ లో టపాకాయల దుకాణాల ఏర్పాటు.. సమసిన లొల్లి...
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే బాణాసంచా దుకాణాల ఏర్పాటు విషయమై మొదట బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వేరువేరుగా ఏర్పాటు చేయడానికి ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసినా చివరికి కలిసి ఉమ్మడిగా దుకాణాల ఏర్పాటుకు రెండు పార్టీల నాయకుల మధ్య సయోధ్య ఏర్పడింది. ఆర్మూర్ పట్టణంలో ప్రతి ఏడాది దీపావళి పండుగ సందర్భంగా నవనాథ సిద్ధులగుట్ట వెనుక ఖాళీ స్థలంలో బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేస్తారు. ప్రతిసారి ఎవరో ఒకరు దీపావళి సందర్భంగా టపాకాయల దుకాణాల అనుమతులను ఒకే దఫాలో తీసుకొని, టపాకాయల దుకాణాల కోసం స్టాళ్లను నంబర్ల వారిగా కేటాయించి ఇతరులకు లక్కీ డ్రా నిర్వహించి కేటాయిస్తారు. అయితే ఈసారి బీజేపీ నాయకులు టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేస్తామని అధికారులకు దరఖాస్తు చేసుకోగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం టపాకాయల దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. రెండు పార్టీల నాయకులు దుకాణాల ఏర్పాటుకు పోటాపోటీగా దరఖాస్తు చేసుకొని అనుమతి ఇవ్వాలని అధికారుల పై ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు చిరాకు పడ్డారు.
దీపావళి పర్వదినాన బాణాసంచా దుకాణాల స్టాళ్లను ఏర్పాటు చేయాలంటే పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్ శాఖ అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. వేరు వేరుగా దుకాణాలను ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదని రెండు పార్టీల నాయకులు గ్రహించి రాజీ పడ్డట్లు సమాచారం. పట్టణంలోని సిద్దుల గుట్ట వెనుక 50 బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. రెండు పార్టీల నాయకులు 25 దుకాణాల చొప్పున తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీనికోసం స్టాళ్లను ఏర్పాటు చేసే వారి వద్ద నుంచి రూ. 12,500 తీసుకోవాలని నిర్ణయించారు. ఈ లెక్కన 50 స్టాల్ల దుకాణాల యజమానుల నుంచి రూ. 6 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. స్టాళ్లను తీసుకునే వారి వద్ద నుంచి అడ్వాన్స్ గా డబ్బును తీసుకొని అనుమతి కోసం ప్రయత్నాలు చేసి అనుమతులు పొంది ఏర్పాట్లు చేసే పనుల్లో రెండు పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. రెండు పార్టీల నాయకులు టపాకాయల దుకాణాల కోసం ఎక్కడ లొల్లి పెట్టుకుంటారొనని అధికారులు ఆందోళనకు గురయ్యారు. చివరికి రెండు పార్టీల నాయకులు కలిసి ఒకే చోట దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అంగీకారం కుదరడంతో అధికారులు సేద తీరారు.
విలీన గ్రామాల్లో టపాకాయల దుకాణాలకు అనుమతులు లేనట్లేనా.. ఎన్నాళ్ళు ఈ తంతు...
ఆర్మూర్ మున్సిపల్ లో గత 7 సంవత్సరాల క్రితం ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి, పెర్కిట్, కోటార్ మూర్ గ్రామాలు వీలీనమైన విషయం అందరికీ తెలిసిందే. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గత ఎన్నో ఏళ్లుగా దీపావళి పర్వదినాన నాలుగు ప్రభుత్వ శాఖల అధికారుల అనుమతులు తీసుకొని టపాకాయల దుకాణాలను ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఒక దగ్గర ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తుంటారు. కానీ ఆర్మూర్ మున్సిపల్ లో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వీలీనమైన మామిడిపల్లి, పెర్కిట్, కోటార్ మూర్ ఏరియాల్లో గత 7 సంవత్సరాలుగా దీపావళి సందర్భంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా టపాకాయల దుకాణాలను దుకాణాల నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా టపాకాయల దుకాణాలు దర్జాగా దుకాణదారులు నిర్వహిస్తున్న సదరు అధికారులు చూసీచూడనట్లుగా పట్టించు కోకుండా వ్యవహరిస్తున్నారని ఆర్మూర్ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీన గ్రామాల్లో టపాకాయల దుకాణాలకు అనుమతులు లేనట్లేనా ఎన్నాళ్లు ఈ తంతు అంటూ పలువురు ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
అన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉండే నాలుగు శాఖల ప్రభుత్వ అధికారులు పర్వదిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు విలీన గ్రామాల్లో ఒకచోట టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సైతం దీపావళి పర్వదినం సందర్భంగా ఎవరి ఏరియాలో వారు పోలీస్ డివిజన్ స్థాయి అధికారి నుండి టపాకాయల అనుమతి లేకుండా దుకాణాలు నెలకొల్పితే వారి పై ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 1884, రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆర్మూర్ మున్సిపల్ విలీన గ్రామాల్లో గత ఏడు సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా దీపావళి పర్వదినాన రోడ్డు పైన గల వారి వారి ఇతర దుకాణాల ముందర దర్జాగా టపాకాయల దుకాణాలను నిర్వహిస్తున్నారు.
ఈ తతంగం మొత్తం టపాకాయల దుకాణాలకు అనుమతులు ఇవ్వాల్సిన అధికారుల కండ్ల ముందరే జరుగుతున్న.. క్రింది స్థాయి అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఆర్మూర్లో గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా ప్రజల బాగు కోసం టపాకాయల దుకాణాల అనుమతుల జారీకి సంబంధించిన నాలుగు శాఖల అధికారులు ఆర్మూర్ మున్సిపల్ విలీన గ్రామాల్లో టపాకాయల దుకాణాలను ఏఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి అనుమతులు తీసుకునేలా కౌన్సిలింగ్ ఇచ్చి ఒక దగ్గర టపాకాయల దుకాణాలను ఒక్కో విలీన గ్రామానికి ఒక్కో దగ్గర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఆ అధికారుల పై ఎంతైనా ఉంది.