Salman: సల్మాన్ ఖాన్ కి రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ సలహా

by Shamantha N |
Salman: సల్మాన్ ఖాన్ కి రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ సలహా
X

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)కు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి బెదిరింపుల వస్తున్నాయి. ఈ తరుణంలో రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ సల్మాన్ ఖాన్ కు మరోసారి సలహా ఇచ్చారు. ‘‘బిష్ణోయ్ గ్యాంగ్ తో సల్మాన్‌ ఖాన్‌కు ఎప్పటి నుంచో వివాదం ఉన్న విషయం తెలిసిందే. ఇది ఒక వ్యక్తికి కాదు.. ఒక తెగ నమ్మకాలకు సంబంధించిన సమస్య. అందుకే సల్మాన్ ఇప్పటికైనా బిష్ణోయ్ లకు సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్లి, గతంలో తాను చేసిన తప్పునకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. దీని వల్ల వారిలో ఆయనపై ఉన్న కోపం పోతుంది. లేదంటే ఇది ఇక్కడితో ఆగదు. సల్మాన్ ప్రాణాలకు ముప్పు తెస్తుంది’’ అని టికాయత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా లారెన్స్ గ్యాంగ్ పై టికాయత్ ఫైర్ అయ్యారు. వారు దుర్మార్గులు.. జైల్లో నుంచే ఇదంతా చేస్తున్నారు. బిష్ణోయ్ ఎవరికి, ఎప్పుడు, ఏ విధంగా హానితలపెడతాడో తెలియదని అన్నారు. క్షమాపణ కోరితే సమస్యలు తొలగిపోయి ప్రశాంతంగా ఉండొచ్చని సల్మాన్‌కు సూచించారు.

బాబాసిద్ధిఖీ హత్యతో..

ఇకపోతే, సల్మాన్‌ సన్నిహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్యతో కృష్ణ జింకలను వేటాడిన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. బిష్ణోయ్‌ తెగకు బహిరంగ క్షమాపణలు చెప్తే ప్రమాదం తప్పే అవకాశముంటుందని రైతు నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ గతంలోనే సల్మాన్‌కు సలహా ఇచ్చారు. కాగా మరోసారి ఆయన సల్మాన్ కి సలహాని ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. దానిని తామే చేశామని లారెన్స్‌ గ్యాంగ్ ప్రకటించింది. దీంతో సల్మాన్‌ నివాసం వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఇకపోతే, సల్మాన్ బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు సైతం కొనుగోలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed