- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో కేసు నమోదు
దిశ, శేరిలింగంపల్లి: దిశ, శేరిలింగంపల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించడం దుమారం రేపుతోంది. తాజాగా మోకిలా పోలీసు స్టేషన్ పరిధిలోని జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న మాజీమంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో ఈ రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. నిన్న (శనివారం) రాత్రి భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నారంటూ డయల్ 100కు ఫోన్ రావడంతో సైబరాబాద్ ఎస్ఓటీ స్పెషల్ పార్టీ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు అర్థరాత్రి ఫాం హౌస్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అది సాధారణ పార్టీ కాదని, రేవ్ పార్టీ అని తేలింది. పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న మద్దూరి విజయ్ అనే ఓ వ్యక్తి బ్లడ్ శాంపిట్స్ టెస్ట్ చేయగా.. అతడు కోకైన్ తీసుకున్నట్లు తేలింది. దీంతో అతడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఇక ఈపార్టీ కోసం రాజ్‌పాకల ఎలాంటి అనుమతి తీసుకోలేదని, అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించినందుకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే ఈ దాడుల్లో 10 అనుమతి లేని ఫారిన్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 10 స్వదేశీ లిక్కర్ బాటిళ్లను కూడా సీజ్ చేశారు. వీటికి సంబంధించి ఎక్సైజ్ యాక్ట్ 34 కింద మరో కేసు నమోదు చేశారు. ఈ పార్టీలో దాదాపు 35 మంది వరకు పాల్గొన్నట్లు సమాచారం. వీరిలో 21 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.