Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్ కాంప్రమైజ్ పాలిటిక్స్.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-10-27 06:24:29.0  )
Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్ కాంప్రమైజ్ పాలిటిక్స్.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) జన్వాడ (Janwada)లోని రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ (Rave Party) పొలిటికల్ వార్‌ (Political War)కు తెర లేపింది. తాజాగా రేవ్ పార్టీపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ (KTR) బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీలా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విషయంలో సుద్దపూసను కావాలనే తప్పించారనే వార్తలు మీడియాలో వార్తలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటని అన్నారు.

ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా.. అడ్డంగా తాము డ్రగ్స్ తీసుకోలేదంటూ బుకాయిస్తారేమోనని కామెంట్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా, రేవ్ పార్టీపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనే విషయాన్ని ప్రభుత్వం నిరూపించాలని అన్నారు. యువతను భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై రాజీ ధోరణి ఎందుకని ప్రశ్నించారు. జన్వాడ రేవ్ పార్టీ (Janwada Rave Party)లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ చుట్టూ సీసీ ఫుటేజీతో సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడలన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని బండి సంజయ్ అన్నారు.

కాగా, శనివారం రాత్రి జన్వాడ ఫామ్‌హౌస్‌ (Janwada Fram House)లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లుగా నార్సింగ్ పోలీసులు (Narsingi Police), సైబరాబాద్ ఎస్‌‌వోటీ పోలీసుల (Cyberabad SOT Police)కు సమాచారం అందింది. రంగంలోకి దిగిన ఖాకీలు జన్వాడలోని ఫామ్‌హౌస్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పార్టీలో మద్దూరి విజయ్ (Madduri VIjay) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి బ్లడ్ శాంపిల్స్‌ని టెస్ట్‌కి పంపిచగా కొకైన్ (Cocain) తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ (Positive Report) వచ్చింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి ఏటీబీఎస్ యాక్ట్‌ (ATBS Act) కింద కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీకి మొత్తం 35 మంది హాజరైనట్లుగా పోలీసులు తెలిపారు. అయితే, సదరు ఫామ్‌హౌజ్ కేటీఆర్ (KTR) బావమరిది రాజ్‌ పాకాల (Raj Pakala)దిగా తెలుస్తోంది. అయితే, రేవ్ పార్టీ నిర్వహణకు సంబంధించి ముందుగా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో రాజ్ పాకాలపై పోలీసులు ఎక్సైజ్ యాక్ట్‌ (Excise Act) కింద కేసులు నమోదు చేశారు. పార్టీలో 10 లీట్లర్ల విదేశీ మద్యం (Foreign Liquor), కొన్ని గేమింగ్ కాయిన్స్ (Gaming Coins) లభించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed