Accident : హెచ్సీయూ సమీపంలో కారు బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం..

by Sumithra |
Accident : హెచ్సీయూ సమీపంలో కారు బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం..
X

దిశ, శేరిలింగంపల్లి : అతివేగంగా వచ్చిన కారు ముందున్న బస్సును ఓవర్ టేక్ ( Take over ) చేయబోయి ఆటోను ఢీ కొట్టి బోల్తా పడిన ఘటన ఆదివారం తెల్లవారుజామున గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ( Gachibowli Police Station ) పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( Hyderabad Central University ) సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున గచ్చిబౌలి వైపు నుండి ముగ్గురు స్నేహితుల తమ స్విఫ్ట్ కారులో లింగంపల్లి వైపుగా వస్తున్నారు.

కారులో డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి ముందుగా వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చేయబోయి పక్కనే ఉన్న ఆటోను స్వల్పంగా ఢీ కొట్టడంతో కారు బోల్తా కొట్టింది. దీంతో కారు డ్రైవర్ తో పాటు అతని ఇద్దరు స్నేహితులు కారులోనే ఇరుక్కుపోయారు. ఆ వైపుగా వెళుతున్న వారు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న వారిని అతికష్టం మీద వెలికి తీశారు. 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను బీరంగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed