- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RTC Driver:ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. ఆ సాంగ్‌తో అదిరిపోయే స్టెప్పులు వేసిన డ్రైవర్(వీడియో వైరల్)
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల సోషల్ మీడియా(Social media)లో చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు సోషల్ మీడియా(Social media)లో వైరల్(Viral) కావాలనే ఉద్దేశ్యంతో వీడియోలు తీస్తుంటారు. కానీ తాజాగా ఓ బస్సు డ్రైవర్(Bus Driver) ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఉండటానికి బస్సు దిగి డాన్స్(Dance) చేసిన వీడియో ప్రజెంట్ సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. కాకినాడ జిల్లా తునిలో ఓ బస్సు డ్రైవర్ డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూ.ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా నటించిన దేవర మూవీ బాక్సాఫీసు వద్ద ఎంత హంగామా సృష్టించిందో తెలిసిందే. ఈ మూవీలోని సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. చుట్టమల్లే, దావూదీ పాటలకు ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ చిందేసిన వారే.
ఈ క్రమంలో దావూదీ.. దావూదీ పాటకు తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్ వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. బస్సులో జనం ఎక్కువగా ఎక్కడంతో బస్సులో సమస్య తలెత్తింది. దీంతో ఆ బస్సు మార్గమధ్యంలోనే ఆగిపోయింది. ఆ బస్సు డ్రైవర్ ఎంత ప్రయాత్నించిన బస్సు స్టార్ట్ కాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక డ్రైవర్ బస్సు దిగాడు. దీంతో ఆ డ్రైవర్‌లోని కళాకారుడు బయటకు వచ్చాడు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ ‘దేవర’ సినిమాలోని దావూదీ సాంగ్‌కు స్టెప్పులు వేసి ప్రయాణికులను అలరించారు. వారిని ఉత్సాహపరిచేందుకు ఆయన డాన్సు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ వీడియోను షేర్ చేస్తూ డ్రైవర్ డాన్స్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే డ్రైవర్ అన్న డాన్స్ పెర్ఫామెన్స్ సూపర్ కానీ.. ఆ బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్యాసింజర్ల పరిస్థితి ఏంటో అని కామెంట్లు పెడుతున్నారు.
Tuni Bus stand Passengers :- Bus endhi inka ravatle ???
— Mahesh Goud #9999# (@indian66669296) October 25, 2024
Meanwhile Driver :- 👇🤣 pic.twitter.com/LlCAfYbyyn
Read More : Nara Lokesh:ఆర్టీసీ డ్రైవర్ డాన్స్‌కు మంత్రి లోకేష్ ఫిదా.. విధుల నుంచి తొలగించిన అధికారులు!