Accident : కారును తప్పించబోయి టిప్పర్ పల్టీ..

by Sumithra |
Accident : కారును తప్పించబోయి టిప్పర్ పల్టీ..
X

దిశ, మర్రిగూడ : కారును తప్పించబోయి టిప్పర్ పల్టీ కొట్టిన సంఘటన ఆదివారం రాత్రి మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మర్రిగూడ చౌరస్తాలో రాత్రి రామ్ రెడ్డి పెళ్లి నుండి మర్రిగూడకు వస్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి చౌరస్తాలో రెండు 133/11 కెవి విద్యుత్ స్తంభాల మధ్య పల్టీ కొట్టింది. దీంతో అక్కడ ఉన్న చెప్పుల డబ్బా పండ్ల డబ్బాలు ధ్వంసం అయ్యాయి. ఎప్పుడు జన సమూహం ఉండే చౌరస్తాలో రాత్రి సమయం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి వట్టిపల్లి ఫీడర్ లైన్ ను విద్యుత్ సిబ్బంది విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించారు.

Advertisement

Next Story

Most Viewed