- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Prakash Raj:‘మూర్ఖంగా రాజకీయాలు చేస్తున్నాడు’.. పవన్ పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తిరుమల(Tirumala) శ్రీవేంకశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో ప్రజలను మతపరంగా పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నడంటూ ప్రకాశ్ రాజ్ స్పందించి విమర్శలు గుప్పించి సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య కొన్నిరోజులు మాటల వార్ నడిచింది. ఇప్పుడు తాజాగా మరోసారి పవన్‌పై ప్రకాశ్ రాజ్ విరుచుకుపడ్డాడు.
పవన్ అంటే మీకెందుకు అంత కోపం అని రిపోర్టర్(Reporter) ప్రశ్నించగా ప్రకాష్ రాజ్ స్పందించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ మూర్ఖత్వ, విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అది నచ్చట్లేదు. ప్రజలు అతడిని ఎన్నుకున్నది మతపరంగా విడదీసి విధ్వంస రాజకీయాలు చేయడానికి కాదు కదా అన్నారు. వీటిని ప్రశ్నించేవారు ఒకరు ఉండాలి కదా. అదే నేను చేస్తున్నాను’ అని ప్రకాష్ రాజ్ సమాధానమిచ్చారు.