- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RC16 టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలపై బిగ్ అప్‌డేట్.. రామ్ పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

దిశ, సినిమా: గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. RC16 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు హీరో. రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchibabu sana) దర్శకత్వంలో ‘RC16’ చేయబోతున్న సంగతి తెలిసిందే. తొలి చిత్రం ‘ఉప్పెన’(Uppena)తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించబోతుండటంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల్లో కూడా ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ పాన్-ఇండియా సినిమాటిక్ వండర్‌ను పవర్‌హౌస్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పిస్తోంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తూ నెక్ట్స్ రేంజ్ గ్రాండియర్ మూవీగా దీన్ని రూపొందించటానికి సుకుమార్ రైటింగ్స్ కూడా చేతులు కలిపింది.
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ బర్త్ డే (Ramcharan Birth day) సందర్భంగా వచ్చే అప్డేట్ కోసం అభిమానులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే అందరి అంచనాలకు తగ్గకుండా మేకర్లు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతోన్నారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ రా అండ్ రస్టిక్, రగ్డ్ లుక్‌లో కనిపించి మెప్పిస్తున్నాడు. చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబురు గడ్డం లుక్‌లో రేపు రామ్ చరణ్ దర్శనం ఇవ్వబోతోన్నట్లు ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janvi Kapoor)కథానాయికగా నటిస్తున్నారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.