Indian fishermen: 12 మంది భారత జాలర్ల అరెస్ట్.. వెల్లడించిన శ్రీలంక నేవీ

by vinod kumar |
Indian fishermen: 12 మంది భారత జాలర్ల అరెస్ట్.. వెల్లడించిన శ్రీలంక నేవీ
X

దిశ, నేషనల్ బ్యూరో: తమ ప్రాదేశిక జలాల్లో వేటకు పాల్పడ్డారనే ఆరోపణలతో శ్రీలంక నేవీ(srilanka navy) ఆదివారం 12 మంది భారతీయ మత్స్యకారులను (Indian fishermens) అరెస్టు చేసింది. అలాగే వారి ట్రాలర్‌ (trawler)ను సైతం స్వాధీనం చేసుకుంది. ఉత్తర ప్రావిన్స్‌ జాఫ్నాలోని పాయింట్ పెడ్రో తీరంలో మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్టు శ్రీలంక నావికాదళం ఓ ప్రకటనలో తెలిపింది. వీరంతా అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటి శ్రీలంక(srilanka) భూభాగంలోకి ప్రవేశించారని ఆరోపించింది. పట్టుబడిన మత్స్యకారులను కంకేసంతురై హార్బర్‌ (Kankesanthurai Harbour)కు తరలించి తదుపరి చర్యల నిమిత్తం మైలాడి ఫిషరీస్ అధికారులకు అప్పగిస్తామని వెల్లడించింది.

దీంతో ఈ ఏడాది శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన భారత మత్స్యకారుల సంఖ్య 462కు చేరుకుంది. అలాగే 62 ఫిషింగ్ బోట్లను ఇప్పటి వరకు పట్టుకున్నారు. కాగా, భారత్, శ్రీలంక మధ్య సంబంధాల్లో మత్స్యకారుల సమస్య వివాదాస్పదమైన విషయం తెలిసిందే. పాక్ జలసంధి, శ్రీలంక నుంచి తమిళనాడును వేరుచేసే ఇరుకైన నీటి స్ట్రిప్. ఇది రెండు దేశాల మత్స్యకారులు చేపలను పట్టుకోవడానికి ఎంతో ముఖ్యమైంది. దీంతో ఇరు దేశాలకు చెందిన మత్స్యకారులు అనుకోకుండా ఒకరి జలాల్లోకి మరొకరు చొరబడినందుకు తరచుగా అరెస్టు చేయబడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed