Rave Party: ఆ ఇంట్లో కేటీఆర్ దంపతులు లేరు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-27 11:22:56.0  )
Rave Party: ఆ ఇంట్లో కేటీఆర్ దంపతులు లేరు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) రోజురోజుకూ ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద(KP Vivekananda) విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ప్రజల్లో వస్తోన్న వ్యతిరేకతే కారణమని అన్నారు. రేవ్ పార్టీ(Rave Party) ఇష్యూలోకి కేటీఆర్‌ను లాగి ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌కు కేటీఆర్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. రాజ్‌పాకాల ఇంట్లో కేటీఆర్ దంపతులు లేరని స్పష్టం చేశారు.

కాగా, హైదరాబాద్‌ శివారు జన్వాడ(Janwada)లోని జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) బావమరిది రాజ్ పాకాల(Raj Pakala)కు చెందిన ఫామ్ హౌస్‌లో ఈ రేవ్ పార్టీ(v) నిర్వహిస్తున్నట్లు రాత్రి పోలీసులకు విశ్వాసనీయ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫామ్‌హౌస్‌(Farmhouse)లో తనిఖీలు నిర్వహించారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలు, 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మద్యం సహా, భారీగా లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేశారు.

Read more : ఒరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే వివేకానంద, బాల్క సుమన్ అరెస్ట్

Advertisement

Next Story