- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ షురూ.. 2 గంటల్లో ఫలితం వెలువడే చాన్స్

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో సరిగ్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ నెల 23న పోలింగ్ జరగ్గా 112 మంది ఓటర్లకు గాను మొత్తం 88 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 78.57 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి (Anurag Jayanthi) పేర్కొన్నారు. అయితే, పోటీలో మజ్లిస్ అభ్యర్థిగా మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ (Mirza Riaz ul Hasan Effendi), బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు (Dr. N. Gautam Rao) బరిలో నిలిచారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress), బీఆర్‌ఎస్ (BRS) పోటీకి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపు మేరకు 24 మంది బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పోలింగ్‌లో పాల్గొనలేదు. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. మరో 2 గంటల్లో తుది ఫలితం వెవువడే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయం చుట్టూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది.