- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కల్కి-2’ మూడు సినిమాలతో సమానం.. అంచనాలు పెంచేస్తున్న నాగ్ అశ్విన్ కామెంట్స్
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రం జూన్ 27న విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఇందులో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan), దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ క్రమంలో డార్లింగ్ ఫ్యాన్స్ ‘కల్కి-2’(Kalki-2) ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా, ఓ ఈవెంట్‌లో భాగంగా నాగ్ అశ్విన్ ‘కల్కి-2’(Kalki-2) మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘‘కల్కి-2 (Kalki-2) ఇప్పట్లో ఉండదు.
అది రావడానికి చాలా టైమ్ పడుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఓ మూడు సినిమాలు కలిపితే కల్కి-2(Kalki-2)తో సమానం. సో ఇంకో మూవీ షూటింగ్ చేసే అవకాశం లేదు. పూర్తిగా కల్కి-2(Kalki-2) కోసమే వర్క్ చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ నాగ్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.