- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Lokesh:ఆర్టీసీ డ్రైవర్ డాన్స్‌కు మంత్రి లోకేష్ ఫిదా.. విధుల నుంచి తొలగించిన అధికారులు!
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ డ్రైవర్ డాన్స్‌కు మంత్రి నారా లోకేష్ ఫిదా అయ్యారు. నీ డాన్స్ సూపర్ బ్రదర్ కీపిట్ అప్ అంటూ అభినందించారు. అంతలోనే ఆ డ్రైవర్‌ను ఉన్నతాధికారి ఉద్యోగం నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. లోవరాజు అనే వ్యక్తి పదేళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. కాకినాడ జిల్లా తుని డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి చిన్ననాటి నుంచి డాన్స్ అంటే మక్కువ. అతను డ్రైవింగ్ చేస్తుండగా రోడ్డు బాగో లేకపోవడంతో కొద్దిసేపు బస్సును ఆపాల్సి వచ్చింది. అయితే ఆ బస్సులో ఉన్న స్కూలు పిల్లలు అతనిని డ్యాన్స్ వేయాలని కోరగా..స్టెప్పులు వేశాడు. దీనిని విద్యార్థులు వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన మంత్రి లోకేష్ శభాష్ అంటూ మెచ్చుకున్నారు. అయితే డ్రైవర్ విధుల సమయంలో డాన్స్ వేశారు అంటూ ఉన్నతాధికారులు అతను ఉద్యోగం నుంచి తొలగించారు. తన ఉద్యోగం నుంచి తొలగించడం పై ఆ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Read More : ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. ఆ సాంగ్‌తో అదిరిపోయే స్టెప్పులు వేసిన డ్రైవర్(వీడియో వైరల్
డాన్స్ సూపర్ బ్రదర్! Keep it up! 👏🏻👌🏻
— Lokesh Nara (@naralokesh) October 26, 2024
I hope the bus passengers had as great a time watching the performance as I did, without any complaints! 😜😂 https://t.co/n8X7TSSKty