Tollywood: తక్కువ సమయంలో ఇంత మాస్ క్రేజ్ వచ్చిన ఇండియన్ హీరో చరిత్రలో లేడు.. ఇంకెవరు రారు.. అతనెవరంటే?

by Prasanna |   ( Updated:2024-10-27 08:13:24.0  )
Tollywood: తక్కువ సమయంలో ఇంత మాస్ క్రేజ్ వచ్చిన ఇండియన్ హీరో చరిత్రలో లేడు.. ఇంకెవరు రారు.. అతనెవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో పుష్ప 2 ( Pushpa 2 ) మూవీ చేస్తున్న విషయం మనకీ తెలిసిందే. పుష్ప 1 ( Pushpa 1 )ఎంత పెద్ద హిట్ అయిందో దేశం మొత్తానికి తెలుసు. ఒక్క డైలాగ్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది అల్లు అర్జున్ మాత్రమే. ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది.

గత రెండేళ్ల నుంచి ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా కోసం దర్శకుడు సుకుమార్ పెద్ద స్కెచ్ వేసినట్టే తెలుస్తుంది. పుష్ప సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రతి సన్నివేశాన్ని సీరియస్‌గా షూట్ చేశారు. తాజాగా, ఈ సినిమాలోని కొన్ని సీన్స్ రీ షూట్ చేసినట్లు తెలుస్తుంది. సినిమా రిలీజ్ కు ఇంకా 40 రోజుల ఉండడంతో మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అల్లు అర్జున్ పార్ట్ 1 లో పుష్ప రాజ్ గా అదరగొట్టి కలెక్షన్స్ పరంగాను రికార్డ్ క్రియేట్ చేసాడు. అయితే, తాజాగా బన్నీ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

అలవైకుంఠపురంలో ( Ala Vaikunthapurramuloo ) సినిమా 1150 థియేటర్స్ లో రిలీజ్ కాగా, పుష్ప పార్ట్ 1 ( Pushpa 1) సినిమా 3000 థియేటర్స్ లో విడుదల కాగా, ఇప్పుడు పుష్ప పార్ట్ 2 (Pushpa 2) సినిమా 11,500 ప్లస్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. దీనిపై రియాక్ట్ అయిన ఫ్యాన్స్ "తక్కువ సమయంలో ఇంత మాస్ క్రేజ్ వచ్చిన ఇండియన్ హీరో చరిత్రలో లేడు.. ఇంకెవరు రారు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story