Swiggy IPO: రూ. 10,000 కోట్లతో స్విగ్గీ ఐపీఓ.. నవంబర్ 6న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం..!

by Maddikunta Saikiran |
Swiggy IPO: రూ. 10,000 కోట్లతో స్విగ్గీ ఐపీఓ.. నవంబర్ 6న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూల కోసం పలు సంస్థలు లైన్ కడుతున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ(Swiggy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఐపీఓ కోసం గత నెల సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(SEBI) వద్ద డీఆర్​హెచ్​పీ పేపర్స్(DRHP​ Papers)ని ఫైల్​ చేయగా సెబీ ఆమోదం తెలిపింది. కాగా ఐపీఓ ద్వారా సుమారు రూ. 10,000 కోట్లను ఆ సంస్థ సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో షేర్ల విక్రయం ద్వారా రూ. 4000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 6000 కోట్లను సమీకరించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఐపీఓ మొత్తాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే ఇందుకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌(Subscription) నవంబర్ 6న ప్రారంభమై 8న బిడ్డింగ్ ముగియనున్నట్లు సమాచారం. యాంకర్ ఇన్వెస్టర్లకు(Anchor Investors) ఒక రోజు ముందే విండో తేర్చుకోనుంది. లాట్ సైజ్, షేర్ల ధరను కంపెనీ త్వరలో ప్రకటించనుంది. అయితే స్విగ్గీ ఐపీఓగా లిస్టింగ్ కాకముందే మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మన దేశానికి చెందిన కొందరు ప్రముఖులు దాదాపు 20 వేల షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. వారిలో రాహుల్ ద్రావిడ్(Rahul Dravid), జహీర్ ఖాన్(Zaheer Khan), రోహన్ బోపన్న(Rohan Bopanna), కరణ్ జోహార్(Karan Johar) వీరంతా స్విగ్గీ షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed