- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్యకు సాయం చేసిన మెగా కోడలు.. మళ్లీ కలవబోతున్నారా..?(పోస్ట్)
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణుదేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’(Johnny), ‘బద్రి’(Bhadri) వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు(Divorce) తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం(Deputy CM)గా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది.
అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’ (Tiger Nageswara Rao)మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. దాదాపు మళ్లీ ఏడాది తర్వాత షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు ఇన్‌స్టా(Instagram) వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా మూగజీవాల సంరక్షణ(Animals Safety) కోసం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎన్జీవో(NGO) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల కల నెరివేరిందని పేర్కొంటూ శనివారం పోస్ట్ పెట్టారు. ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’(Sri Adhya Animal Shelter) పేరుతో ఉన్న ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తానొక అంబులెన్స్(Ambulance) కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీనిని కొనుగోలు చేయడంలో రామ్ చరణ్(Ram Charan) సతీమణి ఉపాసన(Upasana) తన వంతు సాయం చేశారు. చరణ్ పెంపుడు కుక్క రైమీ(Rymy) పేరుతో విరాళం అందించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో చెప్పారు. “అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు” అని రేణు దేశాయ్ అంబులెన్స్ ముందు దిగిన ఫొటోను షేర్ చేస్తూ రాసుకొచ్చింది. అలాగే కొణిదెల ఉపాసనను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. మళ్లీ కలుస్తున్నారా..? అని కొందరు కామెంట్లు చేస్తుంటే మరికొందరేమో మెగా కోడలు మంచితనాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.