కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడిపై దాడి.. చార్మినార్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

by Satheesh |
కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడిపై దాడి.. చార్మినార్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. చార్మినార్ కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడిపై ఎంఐఎం శ్రేణులు దాడికి పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలిసులు స్వల్ప లాఠీ చార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం చార్మినార్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుతుగుతోంది. కొన్ని చోట్ల మాత్రం చిన్న చిన్న ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియగా.. మిగిలిన 106 స్థానాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మరికొన్ని నిమిషాల్లో పోలింగ్ ముగియనుండటంతో ఇప్పటి వరకు ఓటు వేయని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పరుగు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed