మండిపడుతున్న ఎండలు.. వడదెబ్బకు కానిస్టేబుల్‌తో సహ మరో ముగ్గురు మృతి

by sudharani |   ( Updated:2023-05-27 03:13:14.0  )
మండిపడుతున్న ఎండలు.. వడదెబ్బకు కానిస్టేబుల్‌తో సహ మరో ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉక్కపోత, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న తెలంగాణలో అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గరిష్ఠంగా నల్గొండ జిల్లా దామరచర్ల, జగిత్యాల జిల్లా రాఘవపేటలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వడదెబ్బ కారణంగా కానిస్టేబుల్‌తో సహా మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఏఆర్ కానిస్టేబుల్ మధు కుమార్ (41), ఖమ్మం జిల్లాలో ఉపాధి కూలీ సునీత, జిగిత్యాలలో మల్లవ్వ, భద్రాద్రిలో రైతు శ్రీరాములు చనిపోయారు.

Advertisement

Next Story