Patnam Narender Reddy క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

by karthikeya |   ( Updated:2024-11-20 08:55:42.0  )
Patnam Narender Reddy క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
X

దిశ,వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై ఈ రోజు (బుధవారం) విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేయడాన్ని, కింది కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ కేసును కొట్టేయాలని నరేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌పై ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ధర్మాసనం కూడా ఇరు వర్గాలకు అనేక కీలక ప్రశ్నలను సంధించడమే కాకుండా ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్‌ను సబ్మిట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే లగచర్లలో కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను కింది కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆయనకు రిమాండ్ విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.


Advertisement

Next Story

Most Viewed