- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేరికలపై AICC గ్రీన్ సిగ్నల్.. సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గేట్లన్నింటినీ ఓపెన్ చేసింది. ఇప్పటి వరకు కొన్ని ఆంక్షలు, నిబంధనలతో కొనసాగిన జాయినింగ్స్, ఇక నుంచి ఎలాంటి కండీషన్ లేకుండానే సంపూర్ణంగా ఆ పార్టీలో చేరికలు జరిగేలా ప్రణాళికలు రెడీ అయ్యాయి. ఇందుకు ఏఐసీసీ నుంచి కూడా అప్రూవల్ వచ్చింది. అంతేగాక ప్రత్యేకంగా చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చేరికల యాక్టివిటీస్ ను ప్రోత్సహించనున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు లీడర్లతో ఈ కమిటీ సంప్రదింపులు జరుపుతున్నది. చాలా మంది లీడర్లు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు కమిటీ వెల్లడించింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ వరకు కంటిన్యూగా చేరికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్వం సిద్ధమవుతున్నది. దీంతో బీఆ ర్ఎస్ ను ఖాళీ చేయాలనే లక్ష్యాన్ని కాంగ్రెస్ ఎంచుకున్నది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి లీడర్లు వరకు వరుసగా చేరికల పర్వం కొనసాగనున్నది. చేరికలను విస్తృతం చేయకపోతే, ప్రస్తుతం బీఆర్ఎస్ కేడర్, లీడర్లు బీజేపీకి వెళ్లిపోతారనే చర్చ కాంగ్రెస్ లో జరిగింది. దీంతో రెండు రోజుల క్రితం ఏఐసీసీ ఓ నిర్ణ యాన్ని ప్రకటించి, తు.చ తప్పక అమలుచేయాల్సిందేనని టీపీసీసీకి ఆదేశాలిచ్చింది. దీంతో ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే, మరోవైపు చేరికల పర్వాన్ని కొనసాగించనున్నారు.
వాళ్లందరికీ ఆఫరే...?
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది కాంగ్రెస్ కీలక నేతలు, ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. కొందరు తమకు టిక్కెట్ రాలేదేని, మరి కొంత మంది పార్టీలో గుర్తింపు లేదని అలిగివెళ్లిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్ లోకి రావడంతో పార్టీ వదిలి వెళ్లినోళ్లను చేర్చుకోవద్దని గతంలో ఓ నిబంధన పెట్టుకున్నట్లు గాంధీభవన్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. దీంతో చేసేదేమీ లేక చాలా మంది నేతలు బీఆర్ఎస్ లో ఉంటూనే, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరం గా ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది బీజేపీ వైపు చూడడంతో, చేరికలకు ఎలాంటి ఆంక్షలు విధించవద్దని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని హైక మాండ్ ఆదేశించింది. ఈ నెల 25, 26 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ కొనసాగించి, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనే కండువాలు కప్పనున్నారు. ‘‘ఘర్ వాపసీ”పేరిట ఆయా నేతలను కాంగ్రెస్‌లోకి గుంజేయనున్నారు. దీంతో గతంలో పార్టీ వీడిన నేతలకు ఊపిరి పీల్చుకున్నట్లయింది.
ఎమ్మెల్యేల చేరికలపై సీఎందే ఫైనల్..?
బీఆర్ఎస్ నేతల చేరికలను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కోదండరెడ్డి మానిటరింగ్ చేస్తుండగా, ఎమ్మెల్యేల చేరిక ఎపిసోడ్ మాత్రం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ లోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ అండ్ టీమ్ ప్రాథమిక చర్చలు జరిపింది. క్షేత్రస్థాయి నుంచి కీలక లీడర్లందరినీ ఎన్నికల లోపే పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
చేరికలపై ఫోకస్ ఎందుకు..?
లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్ల లక్ష్యంతో ముందుకెళ్తోంది. చాలా నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉన్నది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు బీజేపీ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆలస్యమైతే బీజేపీ బలోపేతం అవుతుందనే అనుమానంతో ఎన్నికల లోపే బీఆర్ఎస్ అసంతృప్తి లీడర్లందరికీ కండువాలు కప్పాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. వంద మందికి పైగా ఎమ్మెల్యేలు ఉంటేనే బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిందని స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాంగ్రెస్, సీపీఐ కలిపి 65 సీట్లు మాత్రమే ఉండటంతో ఈ సంఖ్యను పెంచుకోవాలని సీఎం రేవంత్ గతంలో హైకమాండ్‌కు వివరించారు. దీంతో ఏఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్‌కు కాంగ్రెస్ కండువా కప్పారు.
మేయర్, మానవతా రాయ్ జాయిన్..
వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఓయూ విద్యార్థి నేత మానవతా రాయ్ కాంగ్రెస్‌లో చేరారు. గురువారం చేరికల కమిటీ కీలక నేత జగ్గారెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఇక గౌడ్ సంఘం కీలక నాయకుడు వట్టికూటి రామారావు గౌడ్, మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు, కాట ప్రదీప్ గౌడ్, మెదక్ బాలకృష్ణ, తదితరులు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.